‘చంద్రబాబు అవినీతి’పై జగన్ అస్త్రం ఇదే.. మాజీ మంత్రి, మాజీ సీఎంపై లీగల్ చర్యలు..?
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన అవినీతి బాగోతాలపై విచారణ జరపాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2014 నుంచి 2019 వరకు జరిగిన అవినీతిపై విచారణ జరిపేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమించేందుకు సీఎం వైఎస్ జగన్ అంగీకారం తెలిపారు. ఈ కేబినెట్ సబ్ కమిటీ 30 అంశాలపై విచారణ జరుపుతుందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థల సహకారం తీసుకుంటామన్నారు. విద్యుత్ రంగంపై సమీక్ష సమావేశం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో కరెంటు కొనుగోళ్లలో అక్రమాలపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. సోలావర్, విండ్ పవర్ కొనుగోళ్లపై విస్తృత చర్చ కాంపిటేటివ్ బిడ్డింగ్ రేట్లకన్నా అధిక ధరలకు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని సీఎం ప్రశ్నించారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.2,636 కోట్లు నష్టం వాటిల్లిందని అభిప్రాయపడ్డారు. ఈ డబ్బును రికవరీ చేయాలని సీఎం ఆదేశాలు
జారీ చేశారు. కంపెనీలతో తిరిగి సంప్రదింపులు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
సోలార్, విండ్ కంపెనీలు దారికి రాకుంటే వారితో ఒప్పందాలు రద్దు చేయాలని జగన్ మోహన్ రెడ్డి సూచించారు. సోలార్, విండ్ కంపెనీల్లో ఒప్పందాల్లో భారీ దోపిడీ స్పష్టం అవుతున్న మీదట ఈ ఒప్పందాలు చేసిన ఉన్నతాధికారి, అప్పటి మంత్రి, అప్పటి ముఖ్యమంత్రిపైనా న్యాయపరమైన చర్యలకు ముఖ్యమంత్రి ఆదేశించారు.
Comments
Post a Comment