అమెరికా దేశంలోని మన్‌హట్టన్ నగరంలోని ఓ ఎతైన భవనంపై కూలిన హెలికాప్టరు
న్యూయార్క్ :
అమెరికా దేశంలోని మన్‌హట్టన్ నగరంలోని ఓ ఎతైన భవనంపై హెలికాప్టరు కూలిన ఘటనలో పైలెట్ మృతి చెందారు.
మన్‌హట్టన్ నగరానికి చెందిన పైలెట్ టిమ్ మక్ కార్మాక్ అనే పైలెట్ 34వ హెలీపోర్ట్ నుంచి అగస్టా ఎ 109ఈ హెలికాప్టరులో బయలు దేరారు.
హెలికాప్టరులో బయలుదేరిన 11 నిమిషాలకే సౌత్ ఎవెన్యూలోని 787 ప్రాంతంలో ఉన్న 54 అంతస్థుల భవనంపై హెలికాప్టరు కూలిపోయింది.
ఈ ఘటనలో పైలెట్ అక్కడి కక్కడే మరణించాడని న్యూయార్క్ గవర్నర్ అండ్రూ క్యూమో, మేయర్ బిల్ దీ బ్లాసియోలు చెప్పారు.
హెలికాప్టరు కూలిపోగానే భవనం కంపించిందని, ఈ ఘటనలో భవనంలో ఉన్నవారెవరూ గాయపడలేదని మేయరు చెప్పారు.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే న్యూయార్క్ అగ్నిప్రమాద శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు.
హెలికాప్టరు కూలిన ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం లేదని, వాతావరణం అనుకూలించక జరిగిన ప్రమాదమని పోలీసులు చెప్పారు. కూలిన హెలికాప్టరు కాలిపోయి బూడిదగా మారింది.
Comments
Post a Comment