రాష్ట్రంలో బుధవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
హైదరాబాద్:- రాష్ట్రంలో బుధవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాడ్పులు వీయొచ్చని వెల్లడించింది. రాష్ట్రంలో మంగళవారం అత్యధికంగా మంచిర్యాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 42.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, కరీంనగర్ జిల్లాలో 41.9 డిగ్రీలు, సిద్దిపేటలో 41.4, పెద్దపల్లిలో 41.2 డిగ్రీలు, హైదరాబాద్‌లో 38.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది...
Comments
Post a Comment