వేముల మండలంలో దారుణ హత్య జరిగింది.

కడప: జిల్లాలోని వేముల మండలంలో దారుణ హత్య జరిగింది.

గొల్లలగూడూర్ గ్రామంలోని సిగం మనోహర్ రెడ్డి (35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

గురువారం తెల్లవారుజామున ఇంటిబయట నిద్రిస్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు.

దీంతో మనోహర్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.

స్థానిక సమాచారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటనకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని మనోమర్ కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?