ఒంగోలు గ్యాంగ్ రేప్ కేసు: జగన్‌పై నారా లోకేశ్ సంచలన ఆరోపణలు
టీడీపీ నేత, ఏపీ మాజీమంత్రి నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఒంగోలు మైనర్ గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితులు వైసీపీ కార్యకర్తలే అని ఆయన ఆరోపించారు. ఈ మేరకు నారా లోకేశ్ ట్విట్ చేశారు. ఒంగోలులో మైనర్ బాలికపై పాశవికంగా జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్న నారా లోకేశ్... దేశంలోనే సంచలనం కలిగిస్తున్న ఈ దుశ్చర్యలో నిందితులు వైసీపీ కార్యకర్తలు కావడం సిగ్గుచేటు అని విమర్శించారు. మీ పార్టీ పాలనలో రాష్ట్రం సురక్షితంగా లేదన్న విషయం ఈ ఘటనతో స్పష్టమైందని సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో పదోతరగతి బాలికను నిర్బంధించి ఆరుగురు పదిరోజల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు. షేక్ బాజీ అనే వికలాంగుడు ఈ మొత్తం ఘటనకు స్కెచ్ వేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే దీనిపై స్పందించిన హోంమంత్రి సుచరిత నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.
Comments
Post a Comment