బోరుబావిలో పడిన చిన్నారుల్లో ఒకరు మృతి

నెల్లూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బోరుబావిలో పడిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు చనిపోయారు. గోపిరాజ్ (3) ప్రాణాలతో బయటపడగా..మోక్షిత (4) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. చిన్నారి మ‌ృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విగతజీవిగా పడిఉన్న మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదిస్తున్నారు. మోక్షత స్వస్థలం ప్రకాశం జిల్లా చీరాల కాగా.. నెల్లూరులో బంధువుల ఇంటికి వెళ్లారు. పక్కింట్లో ఉండే గోపిరాజ్‌తో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?