నిఫా వైరస్ ఆందోళన వద్దు అన్న కేంద్రం
కేరళలోని ఓ కొచ్చి విద్యార్థికి నిఫా వైరస్ సోకినట్లు ఇవాళ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పందించారు.
హెల్త్ సెక్రటరీతో పాటు ఇతర ఆరోగ్యశాఖ ఆఫీసర్లతో తన ఇంట్లో మంత్రి హర్షవర్ధన్ సమావేశం నిర్వహించారు.
కేరళకు సోమవారమే ఆరుగురు నిపుణులను కేరళకు పంపినట్లు మంత్రి చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రికి తెలియజేసినట్లు హర్షవర్ధన్ తెలిపారు.
వణ్యప్రాణి శాఖతోనూ టచ్‌లో ఉన్నామని, గబ్బిలాలను పరీక్షిస్తున్నట్లు చెప్పారు.
నిఫా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హర్షవర్ధన్ చెప్పారు.
Comments
Post a Comment