ఎలుకలు వచ్చి పిల్లలను కొరకడం, టార్చ్‌ లైట్లో ఆపరేషన్లు చేయడం లాంటివి ఉండకూడదు:

ఎలుకలు వచ్చి పిల్లలను కొరకడం, టార్చ్‌ లైట్లో ఆపరేషన్లు చేయడం లాంటివి ఉండకూడదు: సీఎం

నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బకాయిలను వెంటనే తీర్చేయాలి:

ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.450 కోట్లు ఉన్నాయి:
9 నెలలనుంచి ఇవ్వడం లేదు, వెంటనే చెల్లించండి:
లేకపోతే పేద రోగులు చాలా ఇబ్బంది పడతారు:
శిశుమరణాలు, మాతృమరణాలను నివారించాలి: కలెక్టర్లకు ఆదేశాలు
ఆస్పత్రుల్లో ఎక్కడ ఖాళీలు ఉన్నా వాటిని భర్తీచేయాలి:
వాటిపై నివేదికలు తయారుచేసి వెంటనే పంపాలి:

కుష్టువ్యాధి మళ్లీ కనిపిస్తోంది, నాకు పాదయాత్రలో కనిపించింది:
కుష్టు వ్యాధి నివారణపై దృష్టిపెట్టాలి:
మందులు, చికిత్స తదితర అంశాలపై సీరియస్‌గా దృష్టిపెట్టండి:
అవసమైతే వారికి పెన్షన్‌ పెంచండి?:

కొత్తగా కట్టిన ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి పరికరాలు ఉన్నాయా? లేవా? చూసుకోండి:
ఎమ్మెల్యేలను ఆస్పత్రుల అభివృద్ది కమిటీకి ఛైర్మన్‌గా నియమించండి:
ఎమ్మెల్యేలు చెప్తున్న అంశాలను పరిగణలోకి తీసుకోండి:
వర్షాకాలం వస్తోంది కాబట్టి జ్వరాలు వస్తాయి, వెంటనే చర్యలకు ఉపక్రమించండి:
ఏజెన్సీ ప్రాంతాల్లో రోగాలు రాకుండా చూసుకోండి:

పౌరసరఫరాల శాఖలో ప్రజలు వాడే వస్తువులు ఇవ్వాలి:
ఇప్పుడిస్తున్న బియ్యం నాణ్యత బాగోలేదు :
అందుకనే మనం ఇచ్చిన బియ్యాన్ని తిరిగి డీలర్‌కే అమ్మేసిన పరిస్థితులు:
తిరిగి అవే బియ్యం పాలిష్‌ చేసి, మళ్లీ ప్రజలదగ్గరకు వచ్చే పరిస్థితి:
ప్రజలు వినియోగించే వాటినే మనం ఇవ్వాలి:
ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధర ఇస్తూ, మరోవైపు క్వాలిటీ బియ్యం ప్రజలకు చేరాలి:
కలెక్టర్లు కీలకమైన పాత్ర పోషించాలి:
గత ప్రభుత్వం రైతులకు రూ.1000 కోట్లు బకాయి పడింది:
ఈ డబ్బులను ఎన్నికల స్కీంలకు మళ్లించారు:
ఈ వేయికోట్లను రైతులకు చెల్లించాలి:

ఆంధ్రప్రదేశ్‌లో నిరక్షరాస్యత 33 శాతం ఉంది: 
జాతీయ స్థాయి సగటు కన్నా ఎక్కువ:
అందుకే తల్లులను ప్రోత్సహించడానికి అమ్మ ఒడి పెట్టాం:
విద్యా రంగం నాకు అత్యంత ప్రాధాన్యమైన అంశాలో ఒకటి:
స్కూల్స్‌ ఫొటో గ్రాఫ్స్‌ తీసి, వాటిని అభివృద్ధి చేస్తాం:
ఫ్యాన్లు, ఫర్నిచర్, ప్రహరీగోడ, బాత్‌రూమ్స్‌ అన్నింటినీ బాగుచేస్తాం:
ప్రతి స్కూలును ఇంగ్లిషు మీడియం స్కూలుగా మారుస్తాం:
తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తాం:
యూనిఫారంలు, పుస్తకాలు సకాలనికే ఇస్తాం:
పిల్లలకు షూలు కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తాం:
గత ప్రభుత్వం మాదిరిగా స్కూలు యూనిఫారాల్లో స్కాంలు జరగకూడదు:
మధ్యాహ్న భోజనంలో నాణ్యతకూడా పెంచుతాం:
ఇవన్నీ చేశాక ఏ పిల్లడుకూడా ప్రయివేటు స్కూలుకు పోవాలన్న ఆలోచన రాకూడదు:
çస్కూల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు కు అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాం:
కేంద్ర ప్రభుత్వం చేసిన విద్యాహక్కు చట్టాన్ని నూటికి నూరుపాళ్లూ అమలు చేస్తాం:
ప్రయివేటు స్కూళ్లలో 25శాతం సీట్లు పేదలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం:
దేశంలో విద్య అనేది సేవేకాని, డబ్బు ఆర్జించే రంగం కాదు: 
ఎవరు విద్యాసంస్థలు పెట్టినా అది వ్యాపారం కాకూడదు, అది సేవ మాత్రమే:
జనవరి 26 నుంచి అమ్మ ఒడి చెక్కుల పంపిణీ:
యూనిఫారం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తున్నాం:
ఇందులో అవినీతి చాలా ఎక్కువగా ఉంది :
ప్రయివేటు స్కూలుకు తప్పనిసరిగా గుర్తింపు ఉండాలి, కనీస ప్రమాణాలు, కనీస స్థాయిలో టీచర్లు కూడా ఉండాలి:
నియమాలు, నిబంధనలు రూపొందించండి:
ఎక్స్‌సెప్షన్‌ ఏమైనా ఉంటే.. దానిపై నిర్ణయం కలెక్టర్‌ తీసుకోవాలి:
విద్యా హక్కు చట్టం... రాజ్యాంగ బద్ధమైన హక్కు:
ఇది ప్రజల హక్కు, కచ్చితంగా ప్రయివేటు స్కూళ్లలో అమలు చేయాలి:

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?