తెలంగాణ స్పీకర్‌, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాకిచ్చిన హైకోర్ట్.

హైదరాబాద్:- తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కారెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారితే తెలంగాణలో ప్రతిపక్షం అనేది ఉండదేమో. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన నేతలు ఓ వైపు ధర్నాలు. మరోవైపు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మంగళవారం నాడు ఈ వ్యవహారంపై విచారించి.. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పోచారంతో పాటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి, ఈసీకి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. సుధీర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ, ఉపేందర్‌రెడ్డి, కాంతారావు, ఆత్రం సక్కు, హర్షవర్దన్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, సురేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. కాగా విచారణ నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. కాగా.. ఈ నాలుగు రోజుల్లో నోటీసులు అందుకున్న స్పీకర్, నేతలు హైకోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంది...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?