భాగవతుల వెంకట పరమేశ్వర రావు మృతికి చంద్రబాబు సంతాపం
అమరావతి
ప్రముఖ సంఘ సేవకులు భాగవతుల వెంకట పరమేశ్వర రావు మృతిపట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.
శాస్త్రవేత్తగా, గాంధేయవాదిగా,సంఘ సేవకునిగా పరమేశ్వర రావు చేసిన సేవలను శ్లాఘించారు.
భాగవతుల ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా గ్రామీణ ప్రజలకు ఎనలేని సేవలు అందించారని, మహిళల ఆర్ధిక స్వావలంబనకు కృషి చేశారని ప్రశంసించారు.
పరమేశ్వర రావు కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు.
Comments
Post a Comment