మమతా బెనర్జీని చంపేస్తే రూ. కోటి ఇస్తామని గుర్తు తెలియని వ్యక్తులు

కోల్‌కతా :

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చంపేస్తే రూ. కోటి ఇస్తామని గుర్తు తెలియని వ్యక్తులు.. ఆరాంబాగ్ ఎంపీ అపరూప పొద్దార్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై పొద్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శ్రీరాంపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

లేఖలో మార్ఫ్ చేసిన మమత ఫోటోను కూడా పంపారు.

అయితే రాజ్‌వీర్ కిల్లా అనే వ్యక్తి లేఖ రాసినట్లు ఉంది. అతని మొబైల్ నంబర్ కూడా లేఖలో పొందుపరిచారు.

బీధన్‌నగర్‌కు చెందిన రాజ్‌వీర్ కిల్లాను పోలీసులు సంప్రదించగా.. తన పేరును తప్పుగా అక్కడ వాడుకున్నారని, ఆ లేఖతో తనకెలాంటి సంబంధం లేదని అతను స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?