కిడ్నాపర్ కు యావజ్జీవ ఖైదు

గుంటూరు జిల్లా భట్టిప్రోలు:

రెండు సంవత్సరాల క్రితం మైనర్ బాలికను కిడ్నప్ చేసి జమ్మూ కాశ్మీర్ సాంబ సెక్టర్(పాక్ బోర్డర్ కి 10కిలోమీటర్ల దూరం) లో ఉంచి పలుమార్లు అత్యాచారం చేసిన కేసులో నిందితుడు నాగేశ్వరరావు కు జిల్లా మొదటి సెషన్స్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.

వివరాల్లోకి వెళితే
భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలో చదువుకుంటున్న బాలికను ఆటో డ్రైవర్ నాగేశ్వరరావు కిడ్నప్ చేసిన సంఘటన అప్పట్లో చర్చనీయాంశం అయినది.

సైనికుడు పనిచేసిన నాగేశ్వరరావు ప్రవర్తన సరిగా లేక విధుల నుండి తొలగించడంతో భట్టిప్రోలు వచ్చి ఆటో నడుపుకుంటూ రోజు ఆటో లో ప్రయాణించే బాలికకు మాయమాటలు చెప్పి జమ్మూకాశ్మీర్ తీసుకు పోయాడు.

చాలా రోజులు ఆచూకీ దొరక్క పోవడంతో రాష్ట్ర స్థాయిలో ఈ కేసు సంచలంగా మారింది.

ఈ కేసు ను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న పోలీసులు అప్పటి రూరల్ SP కె.నారాయణ నాయక్ ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరం చేసారు.

రెండు నెలల తరువాత సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా ట్రెస్ చేసి నిందితుడిని పట్టుకోవడం జరిగింది.

సుమారు రెండు సంవత్సరాలు విచారణ అనంతరం ముద్దాయి నాగేశ్వరరావుకు కోర్టు యావజ్జీవ శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?