నాగార్జున కేక బాసూ.. బిగ్ బాస్‌ను తిట్టాడు.. హోస్ట్ అయ్యాడు..
సాధారణంగా మాటలు మార్చాలంటే రాజకీయ నాయకులే. వాళ్లు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్ధానాలు తర్వాత మరిచిపోతుంటారు. చాలా కొందరికి మాత్రమే అవి గుర్తుంటాయి. ఇప్పుడు నాగార్జున కూడా ఇలాగే మారిపోయాడు. కాకపోతే ఈయన రాజకీయాలు చేయడం లేదు కానీ సినిమాల్లోనే మరిచిపోతున్నాడు. త్వరలోనే ఈయన బిగ్ బాస్ సీజన్ 3 కోసం హోస్టుగా మారిపోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు కూడా ఆసక్తి పుట్టిస్తున్నాయి. అయితే ఇప్పుడు హోస్టుగా మారిన నాగార్జున.. సరిగ్గా ఆర్నెళ్ల కింద మాత్రం ఈ షోపై చాలా విమర్శలే చేసాడు.
అప్పట్లో నాని హోస్టుగా ఉన్న సమయంలోనే ఆయనతో కలిసి దేవదాస్ సినిమా చేసాడు నాగ్. ఆ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నపుడే బిగ్ బాస్ టాపిక్ వస్తే భారీ విమర్శలు చేసాడు నాగార్జున. ఆ షో కాన్సెప్ట్ అసలు తనకు నచ్చదంటూ కామెంట్ చేసాడు నాగార్జున. కొందరిని ఓ ఇంట్లోకి పంపించి వాళ్లేం చేస్తున్నారో దొంగచాటుగా చూడటం.. దాన్నుంచి ఆనందం పొందడం అనేది దారుణం అన్నాడు నాగార్జున. మరొకరి వ్యక్తిగత జీవితంలోకి దాక్కుని చూడటం అనేది బాగోదు.. ఆ హక్కు కూడా ఎవరికి ఉండదని చెప్పాడు ఈ సీనియర్ హీరో
అప్పట్లో మరింత ముందుకెళ్లి బిగ్ బాస్ షోను వాయిరిస్టిక్ అనే పదంతో పోల్చాడు. అంటే నగ్నంగా శృంగారంలో పాల్గొంటున్న సమయంలో చాటు నుంచి చూసి రాక్షసానందం పొందడం అని అర్థం. అప్పుడు అంతటి తీవ్ర విమర్శలు చేసిన నాగార్జున.. ఇప్పుడు అదే షోకు హోస్టుగా వెళ్లబోతున్నాడు. దానికి కారణం 10 కోట్లకు పైగా పారితోషికం అందుకోబోతున్నాడని తెలుస్తుంది. ఏదేమైనా అప్పుడు తిట్టి ఇప్పుడు అదే షో పక్కోడి జీవితంలోకి తొంగి చూడ్డానికి నాగార్జున రెడీ అయిపోయాడంటూ దేవదాస్ విమర్శల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.
Comments
Post a Comment