అమరావతి ప్రజావేదికలో.. జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది.
అమరావతి
నవరత్నాల అమలే ప్రధాన అజెండాగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారు.
అవినీతి రహిత పాలన, గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్లు, 108, 104 సర్వీసుల పనితీరు, ఇంటింటికి రేషన్ సరకుల సరఫరా వంటి అంశాలపై కలెక్టర్ల సదస్సులో చర్చిస్తున్నారు.
రైతుల సమస్యల పరిష్కారం, కరవు,
విద్యారంగం అభివృద్ధిపై సదస్సులో చర్చ జరుగుతోంది.
మధ్యాహ్నం వైఎస్ఆర్ పింఛన్లు, అందరికీ ఇళ్ల నిర్మాణంపై..కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు మొదటిరోజు సదస్సు ముగియనుంది.
రాత్రి 8 గంటలకు విజయవాడ బెరం పార్కులో, అఖిల భారత సర్వీసు ఉద్యోగులకు సీఎం విందు ఇవ్వనున్నారు.
Comments
Post a Comment