రేపు అసలు సమరం జరగనుంది. ఇన్ని రోజులు జరిగిన మ్యాచ్‌లు ఒక లెక్క. రేపు జరగబోయే మ్యాచ్‌ మరో లెక్క.

చిరకాల ప్రత్యర్థి పాక్‌తో రేపు భారత్‌ ఢీకొనబోతోంది.

రేపు మధ్యాహ్నం 3 గంటలకు మాంచెస్టర్‌లో భారత్‌, పాక్‌ మధ్య పోరు జరగనుంది.

ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో ఇప్పటికే భారత్‌ ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచింది. ఇంకో మ్యాచ్‌ వర్షం వల్ల రద్దయింది.

రేపు అంతా అనుకూలిస్తే భారత్‌, పాక్‌తో మ్యాచ్‌ ఆడనుంది.

అయితే.. రేపటి మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ.. మీడియాతో మాట్లాడారు.

మేం బాగా ఆడితే ఏ జట్టునైనా గెలిపించగలం. ప్రత్యర్థి ఎవరు ఉన్నా మా ఆటలో ఎటువంటి మార్పు ఉండదు. ఆటగాళ్లు ప్రత్యర్థి ఎవరైనా వాళ్లు ఆడే విధానం మారకూడదు. ప్రొఫెషనలిజాన్ని మరిచిపోకూడదు. మాకు ఏ ప్రత్యర్థి అయినా ఒకటే. ప్రతి ఆటను ఒకే విధంగా చూడటం మా బాధ్యత.. అని కోహ్లీ తెలిపారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?