ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల
ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల
ఇంజినీరింగ్, ఫార్మసీ సీట్ల భర్తీకి సంబంధించి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ సోమవారం (జూన్ 24) విడుదలైంది.
దీనిప్రకారం ఎంసెట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు జులై 1 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది.
ఇందులో భాగంగా జూన్ 1 నుంచి 9 వరకు రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆప్షన్ల నమోదు చేపట్టనున్నారు. జూన్ 10 నాటికి సీట్ల కేటాయింపు పూర్తిచేయనున్నారు.
మరోవైపు జులై 9 నాటికి ఐఐటీ, ఎన్‌ఐటీల్లో నాలుగో విడత సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తికానుంది.
గతేడాది లాగే ఈసారి కూడా మూడు విడతలుగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు.
జులై 31 నాటికి పూర్తి కౌన్సెలింగ్ ప్రక్రియను ముగించి.. ఆగస్టు నుంచి ఇంజినీరింగ్, ఫార్మసీ తరగతులు ప్రారంభించనున్నారు
Comments
Post a Comment