నేడు రాష్ట్ర వ్యాప్తంలో అటవీ శాఖ బీట్, అసిస్టెంట్ ఆఫీసర్ల ఉద్యోగ అర్హత ప్రాథమిక పరీక్ష జరగనుంది.
అమరావతి
నేడు రాష్ట్ర వ్యాప్తంలో అటవీ శాఖ బీట్, అసిస్టెంట్ ఆఫీసర్ల ఉద్యోగ అర్హత ప్రాథమిక పరీక్ష జరగనుంది.
ఏపీపీఎస్సీ నిర్వహిస్తోన్న ఈ పరీక్షకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.
పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనుంది.
అభ్యర్థులను ఉదయం 8 గంటల నుంచి 9.45 గంటల వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
తిరుపతిలో సుమారు 6,400 మంది పరీక్ష రాయనున్నారు.
విశాఖ జిల్లాలో 10,126 మంది పరీక్షకు హాజరుకానున్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద ఒక నిబంధన అమలుచేయనున్నారు.
జిల్లాలో పరీక్ష రాసే అభ్యర్థుల సందేహాల కోసం టోల్ ఫ్రీ నంబరు 180042500002 ఏర్పాటుచేశారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 430 అటవీ శాఖ ఉద్యోగాలకు ఈ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. మెయిన్ పరీక్ష సెప్టెంబర్ 3న నిర్వహించే అవకాశం ఉంది.
Comments
Post a Comment