పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం

ప.గో: జిల్లాలోని కొణితివాడలో విషాదం చోటు చేసుకుంది. నిన్న అదృశ్యమైన బాలుడు నేడు చెరువులో శవమై తేలాడు.

వివరాల్లోకి వెళ్లితే.. వీరవాసరం మండలం కొణితివాడలో మోక్షగౌతం అనే బాలుడు నిన్న అదృశ్యమయ్యాడు.

దీంతో బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు తీవ్రంగా గాలించారు. ఎంతకు బాలుడి ఆచూకీ దొరకకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నేడు ఉదయం స్థానిక చెరువులో బాలుడి మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు చెరువు దగ్గరకు చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?