ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యనేతలతో సమావేశం

అమరావతి

ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యనేతలతో సమావేశమయ్యారు టీడీపీ అధినేత నారా చంద్రబాబ నాయుడు..

తాజా రాజకీయ పరిణామలు, ప్రజావేదిక కూల్చివేత, ప్రభుత్వ చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

ఇప్పటికే ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ పూర్తి కావొస్తుండగా... ఆ తర్వాత తాను నివాసం ఉంటున్న భవనం కూల్చివేత వరకు పరిస్థితి వస్తే ఏం చేయాలి? అనే దానిపై నేతలతో సమాలోచనలు

ప్రజావేదిక కూల్చివేత తర్వాత ప్రభుత్వం ఏం చేయబోతోంది? అనే చర్చ సాగుతోంది.

వివాదం కోర్టులో ఉన్నందున ఇల్లు కూల్చే ఆలోచన ప్రభుత్వం చేయకపోవచ్చు అంటున్నారు మరికొందరు నేతలు.

చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్ కూడా అక్రమ కట్టడమేనని వైఎస్ జగన్ సర్కార్ వాదిస్తుండడంతో.. గౌరంగా ఖాళీ చేయడం మంచిదని కొందరు నేతలు అభిప్రాయం

మరోవైపు ఇప్పుడు ఖాళీ చేస్తే ప్రభుత్వ చర్యలకు అంగీకారం తెలిపినట్టు అవుతుందని.. ఇప్పుడు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని కొందరు నేతలు చంద్రబాబుకు సూచించినట్టు సమాచారం.

నేతలతో చర్చించిన తర్వాత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?