బస్సు లోయలో పడి ఆరుగురు మృతి

గర్హ్వా: ఝార్ఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

గర్హ్వా ప్రాంతంలో ఓ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. మరో 39 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌ నుంచి గర్హ్వా పట్టణానికి వస్తున్న బస్సు మార్గం మధ్యలో అదుపు తప్పి లోయలో పడింది.

ప్రమాద సమయంలో దాదాపు 50మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటన మంగళవారం వేకువజామున 2.30గంటల ప్రాంతంలో జరిగింది.

స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

మృతి చెందినవారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం. 

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?