ప్రభుత్వ పాఠశాలలు ముద్దు ప్రైవేటు పాఠశాలలు వద్దు ,,, : శ్రీకాకుళం కలెక్టర్ జై నివాస్

శ్రీకాకుళం రూరల్ మండలం లో పెదపాడు గ్రామపంచాయతీ పరిధిలో గల పెద్దపాడు ఉన్నత పాఠశాలలో శనివారం రాజన్న బడి బాట లో కార్యక్రమంలో చివరి రోజు లో భాగంగా

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జై నివాస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరాలని తెలిపారు,

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరినట్లయితే వాళ్లకి మూడు జతల బట్టలు బూట్లు, ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్నం  ఈ సంవత్సరం అక్షయపాత్ర ఆధ్వర్యంలో

ప్రతి నలభై కిలోమీటర్లు పరిధిలో అక్షయ పాత్ర అత్యాధునిక సదుపాయాలతో వంట గదులు నిర్మించారు 

ఈ అక్షయ పాత్ర వారు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు నాణ్యమైన రుచికరమైన భోజనాలను విద్యార్థులకు అందజేస్తున్నట్లు తెలిపారు,

అదేవిధంగా ప్రతి ఒక విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇటు పాఠశాలకు తల్లిదండ్రులకు ఆకాంక్షించారు,

అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం సాయిరాం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో  గత విద్యా సంవత్సరంలో పది పాయింట్లు విద్యార్థులు పరీక్షల్లో సాధించారని తెలిపారు,

అనేక రకమైన మౌలిక సదుపాయాలు విద్యార్థులకు కల్పిస్తున్నారని తెలిపారు, అనంతరం సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారి అయిన డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ

ఈ యాడాది ప్రభుత్వ పాఠశాలలో సరైన సమయానికి  విద్యార్థులకు మూడు జతల ఏకరూప దుస్తులు విద్యార్థులకు అందించామని తెలిపారు,

అదేవిధంగా ఎక్కడయితే పాఠశాలలో మౌలిక వసతులు లేనట్లయితే తమ దృష్టికి తెచ్చినట్లయితే సమస్యను పరిష్కరిస్తానని

ఈ సందర్భంగా తెలిపారు, ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి అయిన జీ కృష్ణారావు, ఎమ్మార్వో ఓ, ఎంపీడీవో, ప్రత్యేక అధికారులు, సెక్రటరీ సింహాద్రి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయినా సుగ్గు కాసులు బాబు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?