ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి తృటిలో తప్పిన ప్రమాదం

విజయనగరం: ఏపీ ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణికి తృటిలో ప్రమాదం తప్పింది.

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆమె తొలిసారి జిల్లా పర్యటనకు శనివారం వెళ్లారు.

స్వాగత ఏర్పాట్లలో భాగంగా పార్టీ కార్యకర్తలు భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో స్వాగత ఏర్పాట్లలో భాగంగా రాజాపులోవ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై కార్యకర్తలు ఎక్కడంతో వేదిక ఓ పక్కకు ఒరిగింది.

భద్రతా సిబ్బంది అప్రమత్తతతో ఆమె వేదిక పై నుంచి కిందకు దిగారు. కొద్దిసేపటికే వేదిక కూలిపోయింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?