చౌక స్మార్ట్‌ఫోన్లు, ఉచిత ఇంటర్నెట్ పాత్ర
భారతదేశంలో ''పెద్దలకు మాత్రమే'' ప్రత్యేకించిన కంటెంట్ వినియోగం 2016-17లో దాదాపుగా రెట్టింపయిందని విడూలీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సుబ్రత్ కార్ చెప్పారు.
విడూలీ తన వినియోగదారులకు అనలటిక్స్, డాటా ఇంటెలిజెన్స్ అందిస్తుంది. ''చౌక స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ దాదాపుగా ఉచితంగా లభిస్తుండడం వల్ల పోర్న్ వీక్షించడం పెరిగినట్లు మా సర్వే చెప్తోంది'' అని ఆయన పేర్కొన్నారు.
ఇటువంటి ఘటనలు ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాలేదని.. మరాఠ్వాడా ఉమన్ అండ్ చిల్డ్రన్ సెల్ కో-ఆర్డినేటర్ జ్యోతి సప్కాల్ తెలిపారు.
''కొన్నిసార్లు మగాళ్ల లక్ష్యం లైంగిక తృప్తి కాదు.. వాళ్లు తమ మగతనం నిరూపించుకోవాలని కోరుకుంటారు. లేదంటే తమ భార్యలను ''అదుపు''లో ఉంచాలని భావిస్తారు'' అని ఆమె చెప్పారు.
''ఇటువంటి హింసకు మూలం.. 'నా పెళ్లాం.. నా ఆస్తి... దానితో నేను ఏమైనా చేసుకోవచ్చు' అనే విశ్వాసమే'' అని జ్యోతి విశ్లేషించారు.
ఒక భర్త పోర్న్ వీడియోలు చూసి, వాటిలోని సెక్స్ కార్యకలాపాలను అనుకరించాలంటూ తన భార్యను కోరిన ఒక ఉదంతం గురించి రాధ తెలిపారు.
''ఒకసారి అతడు ఆమెను చెక్క మంచానికి కట్టేసి, అసహజంగా ప్రవర్తించాడు. వీడియో తీసి తన ఫ్రెండుకి పంపించాడు. అతడొక దినసరి కూలీ. అయినా కూడా పోర్న్ చూడటానికి ఒక స్మార్ట్‌ఫోను, చౌక ఇంటర్నెట్ అతడికి ఉన్నాయి'' అని ఆమె చెప్పారు.
భావావేశాల పాత్ర లేదు..
ఏ మహిళ అయినా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నపుడు ఆమె వెంటనే ఎవరినైనా సాయం కోరాలని హైదరాబాద్‌కు చెందిన సెక్సాలజిస్ట్ డాక్టర్ షర్మిళ మజుందార్ పేర్కొన్నారు.
''ఎలాంటి హింస అయినా, విపరీత లైంగిక చర్యల ద్వారా ప్రేరణ పొందే వికృత లైంగిక వాంఛలను అసలేమాత్రం ఉపేక్షించకూడదు'' అన్నారామె.
సెక్స్ విషయంలో భాగస్వాములిద్దరికీ సమాన స్వేచ్ఛ ఉండాలి. శృంగారాన్ని ఇద్దరూ సమానంగా ఆస్వాదించగలిగేలా ఉండాలి.
కానీ.. భారతదేశంలో వైవాహిక జీవితంలో ప్రేమానురాగాల కోసం ఎదురుచూసే రత్న లాంటి మహిళలకు ఇది ఇంకా పగటి కలగానే ఉంది. సెక్సు విషయాల్లో భారతీయ మహిళల ఇష్టాయిష్టాలకు చోటు లభించడం చాలా అరుదు.
పోర్న్ చూడటంలో తప్పేమీ లేదని కూడా షర్మిళ భావిస్తారు. ''కొన్నిసార్లు దంపతుల మధ్య దూరాన్ని తగ్గించడానికి, ఆరోగ్యవంతమైన లైంగిక సంబంధాలు కలిగివుండటానికి ఇది సాయపడుతుంది'' అని ఆమె పేర్కొన్నారు.
కానీ సెక్సు గురించి మాట్లాడటం ఇంకా నిషిద్ధంగానే ఉన్నా భారత్ వంటి దేశంలో.. సెక్సు గురించి స్కూళ్లలో, ఇళ్లలో బహిరంగంగా చర్చజరగనంత వరకూ.. భార్యాభర్తల మధ్య ఆరోగ్యవంతమైన లైంగిక సంబంధాలు ఉండటమనేది సుదూర స్వప్నమే.
మహిళలు మొదట చేయాల్సిన పని గొంతెత్తి మాట్లాడటమని.. ఆ తర్వాత వారి మాటను భర్తలు, కుటుంబ సభ్యులు వినిపించుకోవాలని ఆశించాలని రాధ అంటారు.
Comments
Post a Comment