రాష్ట్ర రాజధాని అమరావతిలో భారీ వర్షం కురుస్తోంది
అమరావతి:
రాష్ట్ర రాజధాని అమరావతిలో భారీ వర్షం కురుస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రజా వేదిక కూల్చివేత పనులకు ఆటంకం కలుగుతోంది.
ప్రస్తుతానికి దాదాపు 70 శాతం ప్రజావేదిక భవనాన్ని కూల్చివేశారు.
తొలుత ఈ భవనాన్ని నేడు కూల్చివేయాలని భావించారు కానీ అనూహ్యంగా మంగళవారం నుంచే కూల్చివేతకు సన్నాహాలు చేశారు.
అధికారులు, కూలీలను తప్ప ఏ ఒక్కరిని పోలీసులు లోనికి ఎవరినీ అనుమతించలేదు.
సీఆర్డీయే అధికారుల పర్యవేక్షణలో కూల్చివేత కార్యక్రమం ప్రారంభమైంది.
గతంలో ఏ అధికారులైతే దగ్గరుండి ప్రజావేదిక నిర్మాణానికి పూనుకున్నారో అదే అధికారులు దగ్గరుండి భవనం కూల్చివేయించడం గమనార్హం.
Comments
Post a Comment