భారీ నుంచి అతి భారీ వర్షాలు

కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ఐఎండీ వరుసగా నారింజ, పసుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది.

9న కొల్లాం, అలప్పుజ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నారింజ హెచ్చరిక..

తిరువనంతపురం, పతినంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిసూర్, మలప్పురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా పసుపు హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది.

విపత్కర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.

మత్య్సకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది.

నైరుతి అరేబియా సముద్రంపై గంటకు 45 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?