గ్యాస్‌ బాదుడు - వరుసగా నాలుగో నెల పెరిగిన ధరలు

వంట గ్యాస్‌ ధరలు మళ్లీ పెరిగాయి. ఎల్పీజీ ధరలు వరుసగా పెరగడం ఇది నాలుగోసారి.

నెలవారీ ధరల సవరింపులో భాగంగా ప్రభుత్వ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ ఐవోసీ ఈ మేరకు ప్రకటించింది.

సబ్సిడీగ్యాస్‌ సిలిండర్‌(14.2 కిలోల) ధర రూ. 1.23 పెరగ్గా, నాన్‌ సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌(14.2 కిలోల) ధర రూ. 25 పెరిగింది. పెరిగిన ధరలు జూన్‌ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

దీంతో నాన్‌ సబ్సిడీ సిలిండర్‌ ధర ఢిల్లీలో 737.5కి చేరగా, ముంబయిలో 709.5కి పెరిగింది.

కాగా, హైదరాబాద్‌లో రూ. 793కి చేరింది. ఢిల్లీలో సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 497.37కి పెరగ్గా, ముంబయిలో 495.09కి చేరింది.

అయితే, ఖాతాదారులకు బదిలీ అయ్యే సబ్సిడీ మొత్తాన్నీ పెంచినట్టు ఐవోసి తెలిపింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?