తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అనుబంధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఎంసెట్-2019 పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి.
జేఎన్‌టీయూ హైదరాబాద్ ఆడిటోరియంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి, జేఎన్‌టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ఎన్.యాదయ్య విడుదల విడుదల చేశారు.
ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంక్‌ను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన రవిశ్రీ తేజ,
సెకండ్ ర్యాంక్ డి.చంద్రశేఖర్
మూడో ర్యాంక్ ఆకాశ్ రెడ్డి (హైదరాబాద్),
నాలుగో ర్యాంక్ కార్తీకేయ (హైదరాబాద్) సాధించారు.
అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో..కుశ్వంత్ (భూపాలపల్లి)-మొదటి ర్యాంక్,
దాసరి అరుణ్ కుమార్-రెండో ర్యాంక్,
అరుణ్ తేజ-మూడో ర్యాంక్,
సాయి స్వాతి-నాలుగో ర్యాంక్, అక్షయ్-ఐదో ర్యాంక్,
సాయి వంశీ-ఆరో ర్యాంక్ సాధించారు.
ఇక ఇంటర్ వెయిటేజ్ మార్కుల కారణంగా ఎంసెట్ ఫలితాలు విడుదలలో జాప్యం జరిగింది.
కాగా గత నెల 3, 4, 6, 8, 9 తేదీల్లో జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఎంసెట్ ఆన్‌లైన్ పరీక్షలకు హాజరయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,42,216 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 1,31,209 మంది పరీక్షలకు హాజరయ్యారు.
Comments
Post a Comment