షావోమీ నుంచి కొత్త ప్రొడక్ట్... ట్రిమ్మర్ రిలీజ్ చేసిన కంపెనీ

షావోమీ... స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, పవర్ బ్యాంక్, ఎంఐ బ్యాండ్ లాంటి యాక్సెసరీస్‌తో ఇండియన్ మార్కెట్‌లో పట్టు సంపాదించుకున్న కంపెనీ. ఇవి మాత్రమే కాదు... ఎల్ఈడీ బల్బ్, ఎయిర్ ప్యూరిఫైర్, సన్‌గ్లాసెస్‌ను కూడా ఇండియాకు తీసుకొచ్చింది కంపెనీ. ఇప్పుడు మరో కొత్త ప్రొడక్ట్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది షావోమీ. కొంతకాలంగా టీజర్లతో ఊరిస్తున్న ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్‌ను ఆవిష్కరించింది. ప్రీ-ఆర్డర్ ఇప్పటికే మొదలైంది. ధర రూ.1,199. అమెజాన్, ఎంఐ హోమ్స్‌తో పాటు Mi.com వెబ్‌సైట్‌లో జూన్ 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ మొదలవుతుంది.

ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ ఫీచర్లివే

ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్‌కు IPX7 సర్టిఫికేషన్ ఉందని చెబుతోంది కంపెనీ. నీళ్లల్లో తడిసినా ట్రిమ్మర్ పాడవదని హామీ ఇస్తోంది. బియర్డ్‌ని స్టైలిష్‌గా మార్చేందుకు 40 లెంత్ సెట్టింగ్స్ ఉన్నాయి. రెండు కోంబ్స్‌ కూడా లభిస్తాయి. 5 నిమిషాలు చార్జ్ చేస్తే చాలు 10 నిమిషాల పాటు ఉపయోగించుకోవచ్చు. బాక్సులో ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. ఎంఐ ట్రిమ్మర్‌ను పవర్ బ్యాంక్‌తో కూడా ఛార్జ్ చేయొచ్చు. ట్రావెల్ చేసేవారికి ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ బాగుంటుందని కంపెనీ చెబుతోంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?