విజయ్, అట్లీ సినిమా టైటిల్ అదిరింది.. ఫస్ట్ లుక్‌తో పిచ్చెక్కించారుగా..
విజయ్ ఇమేజ్ ప్రస్తుతం తమిళనాట ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరస విజయాలతో నెంబర్ వన్ అయిపోతున్నాడు దళపతి. ఇప్పుడు ఈయన అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మూడోసారి సంచలనానికి తెర తీస్తున్నారు ఈ కాంబినేషన్. తాజాగా విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఒలంపిక్స్ నేపథ్యంలో చేస్తున్నాడు అట్లీ కుమార్. అక్కడ జరిగే అన్యాయాలపై చూపిస్తున్నాడు అట్లీ. తాజాగా జూన్ 22న విజయ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.. దీనికి బిగిల్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు.
ఇందులో విజయ్ ఫుట్ బాల్ కోచ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇదివరకు ఈయన విజయ్ తో తెరకెక్కించిన ‘తెరీ’.. ‘మెర్సల్’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఇందులో ‘మెర్సల్’ కోసం ఏకంగా మెడికల్ మాఫియాను కదిలించాడు దర్శకుడు అట్లీకుమార్. ఇక ఇప్పుడు ఏకంగా ఒలంపిక్స్‌నే టార్గెట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఫుట్ బాల్ కోచ్‌గా నటిస్తున్నాడు విజయ్. ఇందులో కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు దళపతి. ఈ సినిమాలో సాకర్ టీం కోసం 16 మంది అమ్మాయిలను తీసుకున్నాడు దర్శకుడు అట్లీ. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చింది.
గతంలో ‘చక్ దే ఇండియా’లో హాకీ కోచ్‌గా నటించాడు కింగ్ ఖాన్. ఇప్పుడు అలాంటి మహిళా టీం కోచ్ పాత్రలోనే విజయ్ కూడా నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు విడుదలైన ఫస్ట్ లుక్.. బిగిల్ అనే టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. ఇక టైటిల్ కూడా ప్రకటించక ముందే శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలో ఓ ఛానెల్ ఏకంగా 50 కోట్లు చెల్లించిందని తెలుస్తుంది. తమిళనాట ఓ ప్రముఖ ఛానెల్ ఈ హక్కుల్ని సొంతం చేసుకుంది. దసరాకు విడుదల కానుంది ఈ చిత్రం. దాదాపు 100 కోట్లతో బిగిల్‌ను నిర్మిస్తున్నారు.
Comments
Post a Comment