ప్రజావేదిక కూల్చివేతపై స్పందించిన పవన్ కల్యాణ్

ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేతపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ప్రజావేదికతోనే సరిపెట్టకుండా అనుమతిలేని మిగతా భవనాలను కూడా కూల్చివేయాలని పవన్ డిమాండ్ చేశారు. అనుమతిలేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలన్నీ కూల్చినప్పుడే

ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. నిన్నరాత్రి నుంచి జగన్ సర్కార్ ప్రజావేదిక అక్రమ కట్టడటమంటూ కూల్చివేత ప్రారంభించింది. టీడీపీ ప్రభుత్వం దాదాపు రూ.8కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రజావేదికకు అనుమతుల్లేవని అధికారులు కూల్చివేశారు. అయితే ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యను టీడీపీ తీవ్రంగా ఖండించింది. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడం సరికాదన్నారు.

వందమంది కూలీలు... జేసీబీలతో ప్రజావేదిక కూల్చివేత పనులు చేపట్టారు. ఉండవల్లిలోని కరకట్టపై ప్రజలు ఎవరిని అధికారులు అనుమతించ లేదు. మంగళవారం రాత్రి ఏడుగంటల నుంచి కూల్చివేత పనులు జరుగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. నిన్నరాత్రి చంద్రబాబు ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి చేరుకునే లోపే.. ప్రజావేదికను కూల్చివేతను అధికారులు ప్రారంభించేశారు. అంతకుముుందు ప్రజావేదికలో ఉన్న ఫర్నీచర్, ఏసీలు,మైక్ సిస్టమ్స్‌ను అక్కడ నుంచి తరలించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?