పెళ్లయిన ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఈ దంపతులు పిల్లలను ప్లాన్
తెలుగులో సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గీతా మాధురి.. యాక్టర్ నందును ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం ఫిబ్రవరి 9, 2014లో జరిగింది. అంటే దాదాపు పెళ్లయిన ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఈ దంపతులు పిల్లలను ప్లాన్ చేసుకున్నట్లు అర్థమవుతోంది. గీతామాధురి పదేళ్ల కెరీర్లో ఇప్పటి వరకు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో దాదాపు 550 పాటలు పాడింది. పలుచిత్రాల్లో ఆమె పాడిన పాటలకు అవార్డులు కూడా దక్కాయి. ఇక గతేడాది 'బిగ్ బాస్ 2' రియాల్టీ షో ద్వారా తెరపై ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించింది గీతా మాధురి.
Comments
Post a Comment