బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడిని ఎట్టకేలకు రక్షించాయి సహాయక బృందాలు.
పంజాబ్లో ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడిని ఎట్టకేలకు రక్షించాయి సహాయక బృందాలు.
దాదాపు 110 గంటల పాటు నిర్విరామంగా శ్రమించి చిన్నారిని మృత్యు ఒడి నుంచి కాపాడాయి.
పంజాబ్ సంగ్రూర్ జిల్లా భగవాన్పురలో రెండేళ్ల బాలుడు మృత్యువును జయించాడు.
ఈ నెల 6న బోరుబావిలో పడిన చిన్నారి ఫతేవీర్ను సహాయక బృందాలు ఎట్టకేలకు రక్షించాయి.
దాదాపు 5 రోజులపాటు నిర్విరామంగా శ్రమించి బాలుడిని మృత్యుఒడి నుంచి కాపాడాయి.
బోరుబావి నుంచి బయటకు తీసిన అనంతరం బాలుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు సిబ్బంది.
తన పుట్టిన రోజైన ఈ నెల 6న ఇంట్లో ఆడుకుంటూ పక్కనే ఉన్న బోరుబావిలో పడ్డాడు ఫతేవీర్.
అప్పటి నుంచి ఆ చిన్నారిని రక్షించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళం, పాటియాల సాయుధ ఇంజినీర్ల రక్షణ దళాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి.
Comments
Post a Comment