జైలు గోడలు జంప్ చేసి మరీ.. లేడీ కిలాడీల పరార్..
జైళ్లలో ఖైదీలు గోడలు దూకి పారిపోయే ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఆ ఘటనలన్నీ పురుషులకు సంబంధించినవే. మహిళలు అలా పారిపోయిన ఘటనలు లేవు. కానీ, కేరళలో పోలీసులకే షాక్ కలిగించేలా ఇద్దరు మహిళలు జైలు గోడలు జంప్ చేసి పరారయ్యారు. జైలు గోడ వద్ద ఉన్న చెట్టు ఎక్కి అవతలి వైపు దూకి పారిపోయారు. తిరువనంతపురం పరిధిలోని జైలులో ఈ ఘటన జరిగింది. పారిపోయిన ఖైదీలను సంధ్య, శిల్పలుగా జైలు అధికారులు గుర్తించారు. నగరూర్‌కు చెందిన వీరిద్దరిలో దొంగతనం కేసులో శిల్ప, మోసం చేసిన కేసులో సంధ్య శిక్ష అనుభవిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఖైదీల హాజరు తీసుకుంటుండగా వారు జైలు నుంచి తప్పించుకున్నట్లుగా తేలింది.దీంతో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా వీరిద్దరు పారిపోతున్నట్లు కనిపించింది. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.
Comments
Post a Comment