భారత్‌ అందించిన గొప్ప వన్డే క్రికెటర్లలో ఒకడు..

యువరాజ్‌ సింగ్‌.. భారత్‌ అందించిన గొప్ప వన్డే క్రికెటర్లలో ఒకడు..

కళ్లు చెదిరే బౌండ్రీలు, సొగసైన సిక్సర్లు సంధించడంలో సిద్ధహస్తుడు..

చిరుతలా దూకుతూ క్యాచ్‌లు ఒడిసిపట్టడంలో మొనగాడు..

లెఫ్టామ్‌ స్పిన్‌తో కీలక తరుణాల్లో వికెట్లు తీసి ఆపద్బాంధవుడిగా నిలిచే మేటి బౌలర్‌..

2007 టీ20 ప్రపంచక్‌పలో ఇంగ్లిష్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ ఆరు బంతుల్ని ఆరు సిక్సర్లు కొట్టడం యువరాజ్‌ బ్యాటింగ్‌ స్థాయికి నిదర్శనం..

2011 ప్రపంచక్‌పలో అటు బ్యాట్‌తో ఇటు బంతితో చెలరేగి భారత్‌ను రెండోసారి జగజ్జేతగా నిలిపిన ఆల్‌రౌండ్‌ నైపుణ్యం..

ఆ టోర్నీ తర్వాత కేన్సర్‌ బారిన పడి, ఆ మహమ్మారిపై పోరాటంలోనూ విజయం సాధించి మళ్లీ ఆటలో అడుగుపెట్టిన యోధుడు..

మైదానంలోనేకాదు బయటా అభిమానుల జేజేలు అందుకున్న 37 ఏళ్ల యువరాజ్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

పురస్కారాలు

2012: అర్జున

2014: పద్మశ్రీ

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?