పెళ్లికి ఒప్పుకోని పెద్దలు... పురుగులమందు తాగిన ప్రేమజంట

పురుగులు మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య

పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని మనస్తాపంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బుట్టాయిగూడెం మండలం నూతిరామన్నపాలెం గ్రామానికి చెందిన నాగంపల్లి శేఖర్.. అదే గ్రామానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ... ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలన్నారు. ఈ విషయం కాస్త ఇరుకుటుంబాల పెద్దలకు తెలిసింది. దీంతో వారిద్దరి పెళ్లికి ససేమిరా అన్నారు. పెళ్లికి ఒప్పుకొనేది లేదని తేల్చిచెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ప్రేమికులు కలిసి బతకలేక ...కలిసి చావాలనుకున్నారు.

గురవాయిగూడెంలోని ఓ లాడ్జీలో గది తీసుకున్నారు. ఇద్దరు అనుకున్న ప్రకారం అక్కడికి చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా తీశారు. ముందుగా అబ్బాయి శేఖర్ పురుగుల మందు తాగాడు. ఆ తర్వాత అమ్మాయి కూడా ఆ విషాన్ని తాగేసింది. వీరిని గుర్తించిన లాడ్జి యజమాని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శేఖర్ చనిపోగా, యువతి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమజంట ఆత్మహత్యతో ఇరుకుటంబాలతో పాటు.. గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?