యుపిలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం

లక్నో:- యుపిలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8మంది చనిపోయారు. 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. మొరాదాబాద్ – ఆగ్రా జాతీయ రహదారిపై లెహ్రాన్ వద్ద  పెళ్లి బృందతో వెళుతున్న ట్రాక్టర్ ట్రాలీని పాల వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితులు కోత్వాలీ ప్రాంతంలోని దల్ వాల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బాధితుల వ్యక్తిగత వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?