పవన్ కల్యాణ్‌పై అభిమానం అంటే ఇదీ.. తమ కూతురికి పేరు పెట్టాలని..
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అభిమానులు ఎగిరి గంతేస్తారు. ఈలలు వేస్తారు. ఆయన డైలాగులకు పొంగిపోతారు. ఆయన స్టైల్‌కు ఫిదా అవుతారు. ఎంతో మంది ఆయన్ను అనుసరిస్తారు. అదీ ఆయనపై అభిమానులకు ఉన్న అభిమానం. తాజాగా, ఆ అభిమానం ఏ రేంజ్‌లోకి వెళ్లిందంటే.. తమ కూతురి పేరు పెట్టాలని ఓ జంట ఆయన వద్దకు వెళ్లడం. ఏపీలోని చిలకలూరిపేటకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని ఎర్రం అంకమ్మరావు, ఇందిర దంపతులు తమకు పుట్టిన పాపకు నామకరణం చెయ్యాలని జనసేనానిని కోరారు. దీంతో ఆ పాపకు వేద వినీషా అని పవన్ కల్యాణ్ పేరు పెట్టారు. పాపను చేతుల్లోకి తీసుకొని ముద్దాడారు. దీంతో ఆ దంపతులు సంతోషంతో పొంగిపోయారు.
Comments
Post a Comment