కియలో ఇంటర్య్వులు స్థానికులకు దక్కెనా?
అనంతపురం
పెనుకొండ: పెనుకొండ సబ్ కలేక్టర్ కార్యలయంలో కియ కోసం భూములిచ్చిన 374 రైతుకుటుంబాలు చెందిన చదువుకున్న నిరుద్యోగులకు మంగళవారం కియ ప్రతినీధుల బృందం ఇంటర్య్వులను నిర్వహించారు .
హరిపురం ,అమ్మవారిపల్లి ,విజిపాళ్యం, యర్రమంచి,తదితర గ్రామాల నుండి అనేక మంది తరలి వచ్చారు .అయితే ఇంటర్య్వూస్ లో గందర గోళం చోటుచేసుకుంది . అధికారులను నిరుద్యోగులు నీలదీసారు.
ఆర్డీఓ శ్రీనివాసులు సమక్షంలో కియ జిఎం ఉమాశంకర్ , పరిశ్రమలశాఖ జిఎం సుదర్శన్ రావు ,ఎపిఐఐసి జేడ్ ఎం గోపికృష్ణ తో వాగ్వాదానికి దిగారు .ఉద్యాగాల కొసం ఇంటర్య్వూల కోసం ఇది నాలుగోసారి పిలిచారని ఇంతవరకు భూములిచ్చిన ఓక్క రైతు కుటుంబానికి జాబ్ ఇవ్వలేదని తెలిపారు ,
ప్రస్తుతం కియలో 80%మంది తమిళులే పని చేస్తున్నారని వారి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు .స్థానికంగా ఉన్న కొద్ది మందిని వారు పని చేయకుండ అడ్డుపడుతూ ఉద్యోగాల నుండి తోలగించి ,తమవాళ్లను తమిళనాడు నుంచి పిలిపించుకుంటున్నారన్నారు .
రైతు కుటుంబాలకు జాబులిస్తారో లేదో తేల్చి చేప్పాలని . ఇంటర్య్వూల పేరుతో కాలయాపన చేస్తే ఊరుకోమన్నారు .ఏ ఉద్యోగాలున్నాయో 'అవి ఎన్ని ఉన్నాయో నోటిఫికేషన్లో పేర్కొన కుండా ఇక్కడకూ ఎందుకు పిలిపిస్తున్నారన్నారు.
తీరా పిలిపిచ్చి అర్హతకు తగ్గ ఉద్యోగాలు కాకుండా ఏదో ఓ మతలబుతో చిన్న చితకా జాబ్స్ ను ఆఫర్ చేసి మాతోనె వద్దనేలా చేప్పిస్తున్నారని ఆరోపించారు.ఉద్యోగాలు ఇస్తారో లేదో తెల్చి చేప్పాలని లేక పోతే మా భూములు మాకు వేనక్కి ఇవ్వాలని రైతు కుటుంబాలకు చెందిన అభ్యర్థులు 'రైతులు ఎపిఐఐసి , ఇండస్ట్రీస్ ,కియ ప్రతినీధులను నిలదీసారు . అయితే ఈ సారి అందరికి కచ్చితంగా న్యాయం చేస్తామని వారీ హామి ఇవ్వడంతో వారు శాంతించారు.
Comments
Post a Comment