ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా: జగన్

'పెద్దల సభలో తెలుగు పెద్ద' పుస్తకాన్ని ఆవిష్కరించిన జగన్

సినారె పార్లమెంటు ప్రసంగాలపై పుస్తకం

పుస్తకాన్ని రచించిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

ప్రముఖ తెలుగు కవి, సాహితీవేత్త సినారె (సింగిరెడ్డి నారాయణరెడ్డి) పార్లమెంటు ప్రసంగాలపై రూపొందించిన 'పెద్దల సభలో తెలుగు పెద్ద' పుస్తకాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు.

ఈ పుస్తకాన్ని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించారు.

ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ జస్టిస్ గోడ రఘురామ్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఈ పుస్తకాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

సినారే కవితలు, మాటల గురించి తను చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు.

తనకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.

1997లో రాజ్యసభకు సినారె నామినేట్ అయ్యారు. ఆరేళ్ల పాటు ఆయన ప్రశ్నలు, చర్చలు, ప్రస్తావనలు, ప్రసంగాలు అందరి మన్ననలను అందుకున్నాయి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?