కాల్వల భూ సేకరణ వేగవంతం చేయాలి
కాల్వల భూ సేకరణ వేగవంతం చేయాలి
- తహశీల్దార్లు, సర్వేయర్లు, ఇరిగేషన్ జేఈలు సమన్వయంతో వ్యవహరించాలి
- ఆర్డీఓలు, ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి సమీక్ష
సిద్ధిపేట, జూన్ 18: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు కావాల్సిన, వీలుగా అవసరమైన భూ సేకరణను వేగవంతం చేయాలని తహశీల్దార్లు, ఇరిగేషన్ ఇంజనీర్లు, సర్వేయర్లను జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి ఆదేశించారు.
సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం మధ్యాహ్నం జిల్లాలోని పలు ప్రాజెక్టులు, ప్రత్యేకించి కాల్వల భూ సేకరణ అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, డీఆర్వో చంద్రశేఖర్, సిద్ధిపేట ఆర్డీఓ జయచంద్రా రెడ్డి, హుస్నాబాద్ ఆర్డీఓ అనంత రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ ఆనంద్, తహశీల్దార్లు, ఇరిగేషన్ ఇంజనీర్లు, సర్వేయర్లతో భూ సేకరణ పై సుదీర్ఘంగా సమీక్ష జరిపారు.
మిడ్ మానేరు నుంచి ప్యారలాల్ కన్వేయర్ సిస్టమ్ ద్వారా కావాల్సిన భూ సేకరణ అంశాలపై క్షేత్రస్థాయిలో పరిస్థితి, ఉత్పన్నమయ్యే సమస్యలు వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తహశీల్దార్లు, సర్వేయర్లు, వీరిద్దరికీ ఇరిగేషన్ ఇంజనీర్ల సహాకారం పై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి మాట్లాడుతూ.. మధ్య మానేరు నుంచి రోజు ఒక్క టీఎంసీ నీళ్లు నింపడం కోసం ప్యారలాల్ కన్వేయర్ సిస్టమ్ ప్రతిపాదించినట్లు, ఇందు కోసం జిల్లాలో కాల్వల భూ సేకరణకు 1373 ఎకరాల భూమి అవసరం ఉందని ఇప్పటికీ 394 ఎకరాల భూ సేకరణ పూర్తయ్యిందని, ఇంకా 978 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉన్నదని, మిగిలిన భూ సేకరణ ప్రణాళికా బద్ధంగా చేపట్టాలని ఆర్డీఓలు, తహశీల్దార్లు, సర్వేయర్లకు దిశా నిర్దేశం చేశారు.
జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాలకు కాల్వలు తవ్వించి అన్ని గ్రామాలకు సాగునీరు అందించడానికి వీలుగా అవసరమైన భూమిని యుద్ధ ప్రాతిపదికన సేకరించాలని ఆదేశించార
ు. అయితే జిల్లాలోని బెజ్జంకి మండలంలోని గుండారం, బెజ్జంకి, కల్లేపల్లి, ముత్తన్నపేట, దాచారం, వీరాపూర్, తోటపల్లి గ్రామాలలో కాల్వల భూ సేకరణతో పాటు చిన్నకోడూర్ మండలంలోని ఎల్లాయపల్లి, విఠలాపూర్, మాచాపూర్, గంగాపూర్, చంద్లాపూర్, రామంచ, సిద్ధిపేట అర్బన్, రూరల్ మండలంలోని పుల్లూరు, చిన్నగుండవెళ్లి, బూర్గుపల్లి, ఇర్కోడ్, ఎన్సాన్ పల్లి,
వెంకటాపూర్, తడ్కపల్లి గ్రామాలు, తొగుట మండలంలోని బండారుపల్లి, ఎల్లారెడ్డిపేట, ఘనపూర్ తుక్కాపూర్ గ్రామాలలో కాల్వల నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని తహశీల్దార్లను, ఇందు కోసం సర్వేయర్లు ప్రత్యేకించి శ్రద్ధ వహించాలని సూచించారు.
కాల్వల భూ సేకరణలో భాగంగా ఉత్పన్నమయ్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని, భూ తగదా, సమస్యలకు ఆయా మండల తహశీల్దార్ల సహకారం తీసుకోవాలని సూచించారు.
ఈ మేరకు జిల్లాలోని అంతగిరి, రంగనాయక, మల్లన్న సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ల కాల్వల భూ సేకరణలో భాగంగా ఇరిగేషన్ ఈఈ రవీందర్ రెడ్డి, సర్వేయింగ్ ఏడీ మహేందర్, సిద్ధిపేట, హుస్నాబాద్ ఆర్డీఓలు, జయచంద్రా రెడ్డి, అనంత రెడ్డి, తహశీల్దార్లు ప్రతిపాదిత కాల్వల భూ సేకరణ అంశంపై చర్చించారు.
Comments
Post a Comment