చంద్రబాబుది మ్యాచ్ ఫిక్సింగ్... విజయసాయిరెడ్డి విమర్శలు

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ ఎంపీలు చంద్రబాబు బినామీలే అని వ్యాఖ్యానించారు. తనపై అవినీతి కేసులు రాకుండా రక్షణ కోసమే వారిని బిజెపిలోకి పంపించారని ట్విటర్ లో పేర్కొన్నారు. చంద్రబాబుకు తెలియకుండానే ఆ నలుగురు ఎంపీలు పార్టీ ఫిరాయిస్తే.... ఇప్పటికే వారిని అనర్హులుగా ప్రకటించాల్సిందిగా రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాసేవారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అలా చేయకపోవడంతో... ఇది 100 శాతం మ్యాచ్‌ ఫిక్సింగేనని విజయసాయి రెడ్డి ఆరోపించారు. నలుగురు టీడీపీ ఎంపీలు పార్టీ మారితే అనుకూల మీడియా చాలా జాగ్రత్తగా, బీజేపీకి ఆగ్రహం తెప్పించకుండా వార్తలు రాసిందని వ్యాఖ్యానించారు. రెండేళ్ల నుంచి బీజేపీ, మోదీపైన దుమ్మెత్తి పోసిన మీడియా ఇప్పుడు బాబు తీసుకున్న లైన్‌ను అర్థం చేసుకుందని ఎద్దేవా చేశారు. ఇక నుంచి ఆ మీడియాలో బీజేపీని ప్రశంసించే వార్తలొస్తాయని అన్నారు. 

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?