గల్ఫ్ పంపిస్తానని తీసుకెళ్లి.. పలుమార్లు అత్యాచారం.. ఇలా వెలుగులోకి

గల్ఫ్ పంపిస్తానని తీసుకెళ్లి.. పలుమార్లు అత్యాచారం.. ఇలా వెలుగులోకి బతుకుదెరువు కోసం గల్ఫ్ బాట పట్టాలనుకున్న ఓ మహిళను వంచించితన శారీరక వాంఛలు తీర్చుకున్నాడో ప్రబుద్దుడు. గల్ఫ్ ఏజెంట్‌గా పనిచేస్తున్నానని నమ్మించి తనతో పాటు తీసుకెళ్లి.. ఓ లాడ్జిలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.నిందితుడి నుంచి ఎలాగోలా తప్పించుకుని బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కోలి వెంకట నర్సింహమూర్తి అనే వ్యక్తి స్థానికంగా ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. నిరుద్యోగులను గల్ఫ్ దేశాలకు పంపించే ఏజెంట్‌గా లోకల్‌లో ప్రచారం చేసుకున్నాడు. నిజమే అని నమ్మిన ఓ మహిళ ఇటీవల అతన్ని ఆశ్రయించింది. కుటుంబం గడవడం కష్టమవుతుండటంతో మస్కట్ వెళ్లి డబ్బు సంపాదించాలనుకుంటున్నట్టు అతనితో చెప్పింది.దీంతో ఈ నెల 18వ తేదీన ఆమెతో పాటు మరో మహిళను వెంటపెట్టుకుని నర్సింహమూర్తి చెన్నై తీసుకెళ్లాడు. విమాన టికెట్ దొరకలేదన్న కారణంతో తమతో పాటు వచ్చిన మరో మహిళను అక్కడినుంచి పంపించేశాడు.

అనంతరం ఆ మహిళతో ఓ లాడ్జిలో దిగాడు.అక్కడ రెండు రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ధ్రువీకరణ పత్రాలు
సరిగా లేనందునా ఇమిగ్రేషన్ అధికారులు రిజెక్ట్ చేశారని చెప్పి ఆమెను సికింద్రాబాద్‌కి తీసుకొచ్చాడు. రైల్వే స్టేషన్ దగ్గరలో ఓ లాడ్జిలో ఆమెను ఉంచాడు.అదే రోజు ఆమెపై అత్యాచారానికి యత్నించగా.. తప్పించుకుని బాత్రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. కాసేపటికి అతను వెళ్లిపోయాక బయటకు వచ్చి లాడ్జి సిబ్బందికి అసలు విషయం చెప్పింది. వారి సహకారంతో గోపాలపురం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?