అంతరిక్ష కేంద్రంలో ఆరు నెలల కంటే ఎక్కువ కాలం గడిపిన వ్యోమగాముల బృందం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆరు నెలల కంటే ఎక్కువ కాలం గడిపిన వ్యోమగాముల బృందం భూమికి చేరుకుంది. ఖజకిస్థాన్లో మంగళవారం భూమిపైన కాలుమోపింది.
అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం(ఐఎస్ఎస్)లో ఆరు నెలల కంటే ఎక్కువ కాలం గడిపిన ముగ్గురు వ్యోమగాములు మంగళవారం భూమి మీద కాలు మోపారు.
రష్యాకు చెందిన కమాండర్ సీనియర్ ఆస్ట్రోనాట్ ఓలెగ్ కోనోనెన్కో నేతృత్వంలో.. ఐఎస్ఎస్లో గడిపిన అమెరికాకు చెందిన అన్నె మెక్క్లయిన్, కెనడాకు చెందిన డేవిస్ సెయింట్ జాక్వెస్... షెడ్యూల్ కంటే ఒక నిమిషం ముందుగా ఖజకిస్థాన్లో దిగారు.
భూమి మీద కాలుమోపాక కోనోనెన్కో కాస్త నీరసంగా కనపడ్డారు. మిగతా ఇద్దరు ఉత్సాహంగా అభివాదం చేస్తూ దిగారు.
అనంతరం వీరిని ఎండకు కూర్చోబెట్టి ఆహారం అందించారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు.
Comments
Post a Comment