నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం

అమరావతి : నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం శనివారం ముగిసింది.

గవర్నర్‌ నరసింహన్‌, సిఎం జగన్‌ లు వేదిక వద్దకు చేరుకున్నారు. గవర్నర్‌ నరసింహన్‌ 25 మందితో ప్రమాణం చేయించారు.

25 మందిలో అయిదుగురు డిప్యూటీ సిఎం లు. కాసేపట్లో.. మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు.

ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల వివరాలు : ముందుగా.. 

1. శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట నుండి ఎంఎల్‌ఎ గా గెలిచిన ధర్మాన కృష్ణదాస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. 
2. బత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు.
3. విజయనగరం జిల్లా కురుపాం నుండి ఎంఎల్‌ఎ గా గెలిచిన పుష్ప శ్రీవాణి ప్రమాణ స్వీకారం చేశారు.
4. విశాఖ జిల్లా భీమిలి నుండి ఎంఎల్‌ఎ గా గెలిచిన అవంతి శ్రీనివాస్‌, 
5. తూర్పు గోదావరి కాకినాడ రూరల్‌ నుండి ఎంఎల్‌ఎ గా గెలిచిన కురసాల కన్నబాబు, 
6. ఎంఎల్‌సి గా కొనసాగుతున్న పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, 
7. తూర్పు గోదావరి అమలాపురం నుండి ఎంఎల్‌ఎ గా గెలిచిన పినిపె విశ్వరూప్‌, 
8. పశ్చిమ గోదావరి ఏలూరు నుండి ఎంఎల్‌ఎ గా గెలిచిన ఆళ్ల నాని, 
9. పశ్చిమ గోదావరి ఆచంట నుండి ఎంఎల్‌ఎ గా గెలిచిన శ్రీరంగనాథ రాజు, 
10. పశ్చిమ గోదావరి కొవ్వూరు నుండి ఎంఎల్‌ఎ గా గెలిచిన తానేటి వనిత, 
11. కృష్ణా జిల్లా గుడివాడ నుండి ఎంఎల్‌ఎ గా గెలిచిన కొడాలి నాని, 
12. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి ఎంఎల్‌ఎ గా గెలిచిన పేర్ని నాని, 
13. కృష్ణా జిల్లా విజయవాడ వెస్ట్‌ నుండి ఎంఎల్‌ఎ గా గెలిచిన వెల్లంపల్లి శ్రీనివాస్‌, 
14. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుండి ఎంఎల్‌ఎ గా గెలిచిన మేకతోటి సుచరిత
15. గతంలో వైఎస్‌ కేబినెట్‌ పని చేసిన మోపిదేవి వెంకట రమణ,
16. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుండి ఎంఎల్‌ఎ గా గెలిచిన ఆదిమూలపు సురేష్‌
17. ప్రకాశం జిల్లా ఒంగోలు నుండి ఎంఎల్‌ఎ గా గెలిచిన బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి
18. నెల్లూరు సిటీ నుండి ఎంఎల్‌ఎ గా గెలిచిన అనిల్‌ కుమార్‌ యాదవ్‌
19. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుండి ఎంఎల్‌ఎ గా గెలిచిన మేకపాటి గౌతం రెడ్డి
20. చిత్తూరు జిల్లా పుంగనూరు నుండి ఎంఎల్‌ఎ గా గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 
21. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నుండి ఎంఎల్‌ఎ గా గెలిచిన కలత్తూరు నారాయణ స్వామి,
22. కర్నూలు జిల్లా డోన్‌ నుండి ఎంఎల్‌ఎ గా గెలిచిన బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి
23. కర్నూలు జిల్లా ఆలూరు నుండి ఎంఎల్‌ఎ గా గెలిచిన గుమ్మనూరు జయరాం
24. కడప నుండి ఎంఎల్‌ఎ గా గెలిచిన అంజాద్‌ బాషా, 
25. అనంతపురం జిల్లా పెనుగొండ నుండి ఎంఎల్‌ఎ గా గెలిచిన శంకర నారాయణ.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?