విమాన ప్రయాణ ఛార్జీలు కాస్తా ప్రియం కానున్నాయి

దిల్లీ: ఇకపై విమాన ప్రయాణ ఛార్జీలు కాస్తా ప్రియం కానున్నాయి.  వైమానిక రక్షణ ఛార్జీ (ఏఎస్‌ఎఫ్‌)పేరిట టికెట్‌కు రూ.130 నుంచి 150 వరకు పెంచాలని కేంద్ర  పౌర విమానయాన శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పెంచిన ఛార్జీలను జులై 1 నుంచి అమలు చేసే అవకాశముంది.
మరోవైపు అంతర్జాతీయ ప్రయాణికులకు సైతం ఎఏస్‌ఎఫ్‌ చార్జీలను 3.25  అమెరికన్‌ డాలర్ల నుంచి 4.85 అమెరికన్‌ డాలర్లకు పెంచారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం...  దేశీయ విమానాల్లో ప్రయాణిస్తే ఒక్కొక్కరికీ రూ.150 వంతున ఏఎస్‌ఎఫ్‌ ఛార్జీలు వసూలు చేస్తారు. అంతర్జాతీయ ప్రయాణికుల్లో తలకు 4.85 అమెరికన్‌ డాలర్లు వసూలు చేస్తారు.  సవరించిన ఛార్జీలు జులై 1 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని విమానయాన శాఖ తెలిపింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?