నెయ్యి తింటే బరువు పెరుగుతామా.. తగ్గుతామా..
బరువు తగ్గాలనుకునేవారు ఆహారం విషయంలో చాలా కేరింగ్‌గా ఉంటారు. ఇవి తినాలి, అవి తినొద్దు అంటూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా, ఆయిల్, ఆయిలీ ఫుడ్స్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఇందులో భాగంగానే నెయ్యి వాడకాన్ని తగ్గిస్తారు. అయితే.. నెయ్యి తినడం వల్ల బరువు పెరుగతారన్నది కేవలం అపోహ మాత్రమే అని చెబుతున్నారు నిపుణులు..
ఎందుకంటే నెయ్యిలో గుండె కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోజూ తినడం వల్ల అధికబరువు త్వరగా తగ్గుతుంది. అయితే.. రోజుకు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి మాత్రమే తీసుకోవాలి. అంతకుమించి తాగకూడదు. . ఇంతేకాదు.. అల్సర్స్ ఉండేవారు నెయ్యి తాగితే సమస్య త్వరగా తగ్గుతుంది.కాబట్టి.. నెయ్యి తీసుకుంటే బరువు పెరుగుతారన్న అపోహ మాత్రం వద్దని.. రోజూ నెయ్యి తీసుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.
Comments
Post a Comment