మృత్యుంజయులు.. బోరుబావిలో పడిన ఇద్దరు చిన్నారులు క్షేమం

నెల్లూరులో బోరుబావిలో పడిన చిన్నారుల కథ సుఖాంతమయింది. చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు. దాదాపు 2 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత సహాయక సిబ్బంది వారిని కాపాడారు. మృత్యుంజయుడిగా తిరిగొచ్చిన ఆ పసివాళ్లు..బోరుబావి నుంచి తల్లి ఒడికి చేరారు. ఐతే శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది ఉండడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

సోమవారం సాయంత్రం విడవలూరు మండలం ఊటుకూరు పెదపాలెంలో ఇద్దరు పిల్లలు 20 అడుగుల లోతు గుంతలో పడిపోయారు. చిన్నారులు మోక్షత (4), గోపిరాజ్ (3) ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయారు. గుంతలో పడిన గంట తర్వాత బాలుడిని స్థానికులు బయటకు తీయగా.. మోక్షత కోసం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గుంతకు సమాంతరంగా జేసీబీతో మట్టిని తవ్వారు. రెండు గంటల అనంతరం ఆ పాపను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. 

సహాయక చర్యలను ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఇద్దరు చిన్నారులు క్షేమంగా తిరిగి రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తమ బిడ్డలను కాపాడిన రెస్క్యూ సిబ్బంది, అధికారులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కేవలం రెండు గంటల్లోనే ఇద్దరినీ ప్రాణాలతో కాపాడిన సహాయక సిబ్బందిని స్థానికులు అభినందించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?