ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి
అమరావతి:- ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం శాసన సభలో ప్రమాణ స్వీకారాలు కొనసాగుతున్నాయి. తొలిరోజు ప్రొటెం స్పీకర్ ఎంఎల్‌ఎ లతో ప్రమాణం చేయిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. శాసన సభ్యుడిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. శాసన సభ్యుడిగా అంజాద్ బాషా (డిప్యూటీ సిఎం), శాసన సభ్యుడిగా ఆళ్ల నాని (డిప్యూటీ సిఎం), శాసన సభ సభ్యురాలిగా పాములు పుష్ప శ్రీవాణి, శాసన సభ సభ్యుడిగా గుమ్మనూరు జయరాం, శాసన సభ సభ్యుడిగా కురసాల కన్నబాబు ప్రమాణ స్వీకారాలు చేశారు. సభ్యుల ప్రమాణం తర్వాత సభ వాయిదా పడనుంది. రెండో రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక నిర్వహించనున్నారు. తమ్మినేని సీతారాం స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉప సభాపతిగా కోన రఘుపతి ని సిఎం జగన్ ఖరారు చేశారు. ఈ నెల 14 న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 15, 16 తేదీలు అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 17, 18 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పై చర్చ నిర్వహించనున్నారు. ప్రస్తుతం శాసన సభ ప్రమాణ స్వీకారాలు కొనసాగుతున్నాయి...
Comments
Post a Comment