చంద్రబాబు సమవేశానికి టీడీపీ కీలక నేతలు డుమ్మా
ఉండవల్లి తన నివాసంలో చంద్రబాబు నిర్వహించిన సమావేశానికి కీలక నేతలు డుమ్మా కొట్టారు. ఈ భేటీకి బోండా ఉమా,జ్యోతుల నెహ్రు, తోట త్రిమూర్తులు, పంచకర్ల రమేష్‌తో పాటు పలువురు నేతలు గైర్హాజరయ్యారు. విజయవాడలో ఉండి కూడా చంద్రబాబు భేటీకి బోండా ఉమా రాకపోవడం పట్ల తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే అనేకమంది టీడీపీ నేతలు...బీజేపీలోకి వెళ్తున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ... ఇప్పుడు కొందరు బాబు భేటీకి డుమ్మా కొట్టడం అనేక అనుమానాల్ని రేకెత్తిస్తోంది.
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు సీనియర్లతో ఉండవల్లిలోని తన నివాసంలో ఇవాళ చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పలువురు టీడీపీకి చెందిన ముఖ్య నేతలంతా హాజరయ్యారు. ప్రజావేదిక కూల్చివేతతో పాటు...పార్టీ ఫిరాయింపులు,చంద్రబాబు కుటుంబానికి భద్రత తగ్గింపు వంటి కీలక అంశాలపై చర్చించారు. వీటితో పాటు ఈ మధ్యకాలంలో టీడీపీ శ్రేణులపై దాడులు వంటి అంశాల్ని కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి టీడీపీ నేతలు కళా వెంకట్రావు, కాల్వ, సోమిరెడ్డి, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా, పోతుల సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా భేటీకి ముందు మీడియాతో మాట్లాడిన పలువురు టీడీపీ నేతల జగన్ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించారు.
Comments
Post a Comment