మోదీ ప్రభుత్వంలొనే మహిళల సాధికారత : హేమమాలిని
ఇవాళ లోక్‌సభలో ఎంపీ హేమామాలిని మాట్లాడారు. స్పీకర్ ఓం బిర్లాకు ఆమె కంగ్రాట్స్ చెప్పారు.
మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను ఆమె గుర్తు చేసుకున్నారు.
మోదీ నాయకత్వంలో నూతన భారత మార్పును చూడగలిగామన్నారు.
బీజేపీని గెలిపించిన ప్రజలకు హేమామాలిని థ్యాంక్స్ చెప్పారు.
మహిళల సాధికారత కోసం మోదీ ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందన్నారు.
ప్రతి పరిశ్రమలోనూ మహిళలు ఉన్నారని, బ్యాంకులను కూడా మహిళలు నడుపుతున్నారన్నారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఫైటర్ జెట్స్ నడపడంలోనూ మహిళలు కీలకంగా మారినట్లు ఆమె చెప్పారు.
మోదీ చేపట్టిన మహిళ సంక్షేమ కార్యక్రమాలను హేమామాలిని కొన్ని కవితల ద్వారా వినిపించారు.
తన నియోజకవర్గం మధురలో తీవ్ర నీటి సమస్య ఉన్నట్లు ఆమె చెప్పారు.
యమునా నది శుద్ధీకరణ అవసరం అన్నారు.
Comments
Post a Comment